గాయత్రి వార్తలు - ప్రత్యేకం / తిరుపతి :
కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న సామెత మాదిరిగా తయారైంది ఓ రైతు పరిస్థితి. వరి చేలో పెరిగిన కలుపును తొలగించేందుకు ఫెర్టిలైజర్ షాపు యజమాని ఇచ్చిన కలుపు మందు పిచికారీ చేసిన రైతు తన మూడెకరాల పంటను నష్టపోయిన ఘటన చోటు చేసుకుంది. రైతు కొత్తూరు చెన్నకేశవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కుక్కునూరు మండలంలోని తొండిపాక గ్రామానికి చెందిన చెన్నకేశవరావు మూడు ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నాడు వరి పంటలో కలుపును తొలగించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు గ్రామంలో శ్రీ సాయి ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో కలుపు మందును కొనుగోలు చేశాడు. అయితే ఆ కలుపు మందును పిచికారి చేయగా అది పని చేయలేదు ఇదే విషయమై సదరు ఫెర్టిలైజర్స్ దుకాణ యజమానికి తెలియపరచగా అతను కంపెనీ వారినీ పిలిపించి పంటను పరిశీలించారని అంతేకాక మరో మందును తెప్పిస్తామని చెప్పినట్టు రైతు పేర్కొన్నాడు. కాగా రైతు చెన్నకేశవరావు ఒకవేళ మందు ఆలస్యం అవుతుందనుకుంటే దున్ని మరల నారు వేస్తానని చెప్పగా అవసరం లేదు నేను ఖమ్మం నుంచి తెప్పిస్తాను.