Saturday, 11 April 2026 06:26:32 PM
-> రైతు కొంప ముంచిన కలుపు మందు.. -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం.. -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌.. -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్.. -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్.. -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి.. -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన .. -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం.. -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె.. -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్.. -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి.. -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు.. -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి


Date : 29 June 2025 03:34 PM Views : 786

గాయత్రి వార్తలు - జాతీయం / తిరుపతి : దేవభూమి ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్రను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు.

హరిద్వార్, రుషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్ వంటి కీలక ప్రాంతాల్లో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో ఆపివేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు యాత్రికులు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయన సూచించారు.వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులు మూతపడ్డాయి. చమోలీ జిల్లాలోని నందప్రయాగ్ భానర్పానీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేసినట్లు జిల్లా పోలీసులు ప్రకటించారు. యాత్రికులు, స్థానికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ భరోసా ఇచ్చారు. ఈ పరిణామాలపై స్పందించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.

M Espitha Chowdary

Admin

Copyright © Gayathri Varthalu 2026. All right Reserved.